
జొన్నలగడ్డ వెంకట సోమయాజులు (1926 – 2004)
శంకరాభరణం ‘శంకర శాస్త్రి’గా దేశ విదేశాలలో గౌరవ ప్రతిష్టలు పొందిన వీరు మొదట రంగస్థల నటుడు.
శంకరాభరణం సినిమాలో ‘శంకర శాస్త్రి’గా నటించి అందరి ప్రశంసలు పొందారు దేని కారణంగా శంకరాభరణం సోమయాజులుగా , ‘శంకర శాస్త్రి’ పేర్లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచస్తులు
శ్రీకాకుళం జిల్లా లుకులాం అగ్రహారంలో 1928 జూలై 30న శారదాంబ, వెంకటశివరావు దంపతులకు జన్మించారు. తల్లి శారదాంబ వీరిని ప్రోత్సహించింది.తండ్రి ప్రభుత్వ ఉద్యోగి . సోమయాజులు చిన్నతనంనుండి నాటకాల్లో నటించారు , ఉద్యోగం చేస్తూ వీరి తమ్ముడు ప్రసిద్ధ నటుడు జె.వి. రమణమూర్తితో కలసి ఎన్నో నాటకాల్లో నటించారు. సుమారు నాలుగు దశాబ్దాలు జె. వి. రమణమూర్తి దర్శకత్వంలో ‘కన్యా శుల్కం’ నాటకంలో రామన్న పంతులు పాత్ర పోషించారు. అనేక పరిషత్తు నాటకాల్లో నటించి బహుమతులు పొందారు. ఆయన తొలి చిత్రం ‘రారా కన్నయ్య’లో ఆయన నటన చూసి కె. విశ్వనాథ్ గారు శంకరాభరణం సినిమా తీసే సమయంలో శంకరశాస్త్రి పాత్రకు యస్పీబాల సుబ్రహ్మణ్యం వీరి పేరు సూచించగా డిప్యూటీ కలక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇందులో నటించి ‘శంకరాభరణం శంకరశాస్త్రి’గా ప్రపంచ ప్రసిద్ధి నొందారు.
వీరు తర్వాత ఎన్ని చిత్రాలలో నటించినా వీరిపై శంకర శాస్త్రి ముద్ర పోకపోగా వీరిపై గౌరవం తగ్గేటట్లుచేశాయి. ‘వంశవృక్షం’లోని పాత్ర వీరికి కొంత గౌరవాన్ని ఆపాదించింది. శంకరాభరణం శంకరశాస్త్రి గారి పాత్రను చూసి డా॥ మర్రి చెన్నారెడ్డిగారు ముఖ్య మంత్రిగా వుండగా వీరిని సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసి డైరెక్టర్గా నియమించారు. ఆ తర్వాత పదవీ కాలం 55 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఎన్టీర్ కుదించగా ఆ పదవి నుండి తప్పుకోవలసి వచ్చింది. ఆ తర్వాత సి. నారాయణరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా వున్నపుడు వీరిని రంగస్థల కళల శాఖకు అధిపతిగా నియమించారు. వీరు 2004 ఏప్రిల్ 24న పరమపదించారు. ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని ఉద్యోగాలుచేసినా వీరుమాత్రం శంకరాభరణం శంకర శాస్త్రే.