Uncategorized

మల్లాది వేంకట కృష్ణశర్మ – సుప్రసిద్ధ నాటక, సినిమా రచయిత

మల్లాది వేంకట కృష్ణశర్మగారు 1907లో శ్రీకాకుళంలో జన్మించారు.. సుప్రసిద్ధ నాటకాలు, నాటికలూ చాలా రాసి, సినిమాల్లోకి ప్రవేశించారు. తొలి చిత్రం- అంజలి పిక్చర్స్‌ నిర్మించిన ‘పరదేశి’ (1953). అంజలి పిక్చర్స్‌వారు పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు. మంచి టెక్నీషియన్లతో మంచి సినిమా తియ్యాలని ఆలోచించి, హిందీలో వచ్చిన ‘రాజా రాణి’ని కొన్నారు. దాన్ని డైరక్ట్‌ చెయ్యడానికి దర్శకుడిగా పేరు పొందిన ఎల్‌.వి.ప్రసాద్‌గారిని …

చట్టి చిన పూర్ణయ్య పంతులు – ప్రఖ్యాత రంగస్థల నటులు.

చట్టి చిన పూర్ణయ్య పంతులు (1885 – 1935) ప్రఖ్యాత రంగస్థల నటులు. ఈయన 1885 సంవత్సరం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం క్షేత్రంలో వెంకటనర్సులు, వెంకట నరసమ్మ దంపతులకు జన్మించాడు 1901లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులై 1911 సంవత్సరంలో పట్టభద్రులయ్యాడు. 1912లో ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణులై న్యాయవాద  వృత్తిని ప్రారంభిచాడు. శ్రీకాకుళంలో 1905లో “హామ్లెట్” నాటకంలో హోరేషియా భూమికను పోషించడం ద్వారా నాటకరంగంలో ప్రవేశించాడు. 1907లో రమా విలాసినీ సమాజంలో చేరి గయోపాఖ్యానంలో బలరాముడు, పాండవోద్యోగ విజయాలలో కర్ణుడు మొదలైన పాత్రలను ధరించాడు. 1911లో మద్రాసులో చిత్రనళీయం నాటకంలో బహూక పాత్రపోషించి ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారిని …

వాండ్రంగి రామారావు (భావశ్రీ) – సాహితీ వేత్త

(భావశ్రీ) వాండ్రంగి రామారావు ఆంధ్ర ప్రదేశ్ , శ్రీకాకుళం జిల్లా, పొందూరు సమీపంలో సంతవురిటి గ్రామంలో 1935 జనవరి 26న సూర్యనారాయణ (మానవతావాది, సామాజిక సేవకులు), అమ్మన్నమ్మ (గృహిణి) దంపతులకు జన్మించారు . తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలో కూడా ప్రవేశం ఉంది. వాండ్రంగి రామారావు సాహితీ వేత్త, గ్రంథ రచయితగా, వ్యాఖ్యాతగా రామారావు జీవనయానం ఈయన 13వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు. …

బలివాడ కాంతారావు – సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత.

బలివాడ కాంతారావు ( 1927, జూలై 3 – 2000, మే 6 ) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని ( వంశధార నదీ తీరాన) మడపాం అనే గ్రామంలో సూర్యనారాయణ , రవణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తొమ్మిది మంది పిల్లలలో పెద్దవాడు. తొమ్మిది సంవత్సరాల వయసు వరకు మడపాం లో ప్రాదిమిక విద్య తరువాత విశాఖపట్నంలో ఉన్న తన మామ & అత్తతో ఉంటూ AVN కళాశాల …

వడ్డాది పాపయ్య – భారతదేశ ప్రముఖ చిత్రకారుడు

భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు శ్రీవడ్డాది పాపయ్య. పవిత్ర నాగావళీ నదీ తీరాన శ్రీకాకుళం పట్టణంలో రామమూర్తి, మహలక్ష్మి దంపతులకు సెప్టెంబరు 10, 1921 ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న రవివర్మ చిత్రం “కోదండ …

దూసి బెనర్జీ – కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌

దూసి బెనర్జీ  అసలు పేరు కూర్మనాధశర్మ, శ్రీకాకుళం జిల్లా దూసి గ్రామం బహుముఖ ప్రజ్ఞాశాలి! రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌.. ఇవన్నీ కలబోసి పోతపోసిన బహుముఖ ప్రజ్ఞాశీలి దూసి బెనర్జీ. హరికథా కళారూపం పేరు చెప్పగానే గుర్తొచ్చేది బెనర్జీయే. కాగా మంచినటుడిగా సుకుమార్‌ ఆర్కెస్ట్రా నిర్వహకుడిగా తెలిసేది కొందరికే. 1948లో కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్రతో ప్రారంభమైన ఆయన నటజీవన ప్రస్థానం జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి (నటరాజ్‌ కళాసమితి), …

రోణంకి అప్పలస్వామి – సాహితీవేత్త , బహు భాషా కోవిదుడు

  రోణంకి అప్పలస్వామి టెక్కలిని  అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15న  తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి – రోణంకి చిట్టెమ్మ లకు జన్మించారు.. తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాలయాల్లో చదువులు పూర్తిచేసి   ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. తరువాత కాలంలో చదువుకున్న చోటే విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు …

పురిపండా అప్పలస్వామి – రచయిత, కవి,బహు భాషా కోవిదుడు,

పురిపండా అప్పలస్వామి 13 నవంబర్ 1904లో శ్రీకాకుళం జిల్లాలోని సాలూరులో జన్మిం చారు. గిడుగు రామమూర్తిగారి వ్యావహారికాంధ్రోద్యమ వారసుడు, బహుభాషా కోవిదుడు, రచయిత, కవి, సంఘసంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి పురిపండా. ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. గాంధీజీ చేపట్టిన ఉద్యమాలలో సహాయ నిరాకరణ ఉద్యమం ,హరిజనోద్యమం, ఖాదీ ప్రచార ఉద్యమం ,భాషా ప్రచారం ఉద్యమాల్లో చురుగా పాల్గొన్నారు. విశాఖపట్నంలోని అఖిల భారత చరక సంఘంలో నిర్వాహకుడిగా కూడా పనిచేశారు. …

కరణం మల్లేశ్వరి

(1975 – ) మహిళా విభాగంలో ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించిన ఏకైక మహిళ కరణం మల్లీశ్వరి. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీపంలో  వూసవానిపేట  గ్రామంలో శ్యామల, కరణం మనోహర్లకు 1975లో జన్మించింది. వీరి తల్లిదండ్రులు చిత్తూర్ జిల్లాకు చెందినవారు ,ఈమె తండ్రి రైల్వే రక్షణ దళంలో ఉద్యోగి, కళాశాల స్థాయి ఫుట్బాల్  ఆటగాడు. ఈమె తన 12ఏట చదువు మానివేసింది. 15 సంవత్సరాల వయస్సులో తన అక్క నరసమ్మను చూడడానికి బెంగుళూరు …

తాపీ ధర్మారావు – తెలుగు రచయిత, గేయ రచయిత మరియు సంఘ సంస్కర్త

తాపీ ధర్మారావు నాయుడు తెలుగు రచయిత, గేయ రచయిత మరియు సంఘ సంస్కర్త కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును, మరెన్నో సాహిత్య అవార్డులను సంపాందించుకున్న తాపీ ధర్మారావు. ‘తాతాజీ’గా ముద్దుగా పిలుచుకునే ఈయన అందరికీ సుపరిచితులే. తాపీ ధర్మారావు శ్రీకాకుళంలోని ఒక గ్రామానికి చెందినవాడు మరియు సెప్టెంబర్ 19, 1887న బెర్హంపూర్‌లో జన్మించాడు. అతని తండ్రి థాపీ అప్పన్న నాయుడు ఒక వైద్యుడు మరియు తల్లి పేరు నరసమ్మ. వీరికి ఐదుగురు  సంతానం. అందులో ధర్మారావు రెండో సంతానం …