కళారత్న దివిలి అప్పారావు శిల్పి

 

దివిలి అప్పారావు (శిల్పి) ,M.A.,M.Ed., M.Phil.,
శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం గ్రామంలో రామమూర్తి, సూరమ్మ దంపతులకు జన్మించారు. చేతివృత్తులను ఆదరించే రోజులనుంచి తన కుటుంబ వారసత్వ కళను అభ్యాసం చేసేవాడు .

ప్రాధమిక విధ్య చదువుతున్న రోజుల్లోనే తన స్వహస్తలతో మట్టితో మహాత్మా గాంధీ బొమ్మను తయారు చేసి  గ్రామ పెద్దలు , పాఠశాల ఉపాధ్యాయుల  ప్రశంసలు పొందారు ,అలా  తన కళా నైపుణ్యాన్ని పదును పెట్టి కళా రంగంలో ప్రావీణ్యం సంపాదించారు.ఒక వైపు ఉన్నత  చదువులను కొనసాగిస్తూ  మరో వైపు కళారంగాన్ని  వృద్ధి చేసుకున్నారు .

చిత్రలేఖన ఉపాధ్యాయునిగా ఉద్యోగ పర్వం ప్రారంభించి ఉన్నత విద్యార్హతలను పెంచుకుంటూ, ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో అధ్యాపక స్థాయికి ఎదిగారు .

దివిలి అప్పారావు కళా శిల్పాలను తయారుచేస్తూ జిల్లాలోనే కాకుండా ఇతర   ప్రాంతాల్లో కూడా విగ్రహాలు తయారీ చేస్తూ కళా రంగానికి , తన జిల్లాకు కీర్తినార్జించి పెట్టారు .

భారత ముద్దుబిడ్డల కళా శిల్పాలు  మహాత్మ గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ, పొట్టి శ్రీరాములు మహనీయుల శిల్పాలు తయారుచేసవారు, శ్రీకాకుళం అప్పటి మున్సిపల్ చైర్మన్ పసగాడ సూర్యనారాయణ విగ్రహాలను తయారుచేయడం, వావిలాల గోపాలకృష్ణయ్య చేతులమీదుగా ఆవిష్కరించడం, అలాగే గాంధీ మనుమరాలు తారాభాయి చేతులమీదుగా ఆవిష్కరించబడి ఆమె ప్రశంసలు పొందడం ఆయన శిల్ప నైపుణ్యానికి నిదర్శనం.

అలాగే INTACH Srikakulam chapter వారు నాగావళి కొత్త వంతెన రోడ్డుపై స్థాపించిన ప్రముఖుల విగ్రహాలు గరిమెళ్ల సత్యనారాయణ, బంకుపల్లి మల్లయ్యశాస్త్రి, అంతర్జాతీయ పహిల్వాన్, ఇండియన్ హెర్క్యులెస్ గా పేరు పొందిన  కోడిరామమూర్తి, మానికొండ చలపతిరావు, మాజీ స్పీకర్ తంగి సత్యనారాయణ, ఆచార్య రోణంకి అప్పలస్వామి వంటి వారి విగ్రహాలు దివిలి అప్పారావు చేతుల్లోనే మలచబడ్డాయి. ఆయన శిల్పకళా నైపుణ్యం తన గురువు కూర్మాపు నరసింహం, డా॥ ఎస్.వి.రామారావు ప్రశంసలు పొందడం గమనార్హం.