Month: June 2025
గౌరవనీయులైన శ్రీ జస్టిస్ కె. పున్నయ్య 1923 ఆగస్టు 19న జన్మించారు. బారువా, సురంగి రాజాస్ హైస్కూల్, ఇచ్చాపురం, ఎం.ఆర్. కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరులలో విద్యనభ్యసించారు. విజయనగరంలోని ఇంటర్మీడియట్ ఎం.ఆర్. కళాశాలలో చదువుతున్నప్పుడు, ఆయన 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి చదువును ఆపవలసి వచ్చింది.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947లో చదువును తిరిగి ప్రారంభించారు. 1953లో న్యాయ పట్టా పొందారు. 1956 సెప్టెంబర్‌లో న్యాయవాదిగా చేరి …
కోడి రామ్మూర్తి నాయుడు (1882?- 1942 జనవరి 13) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి( కోడి నారాయణస్వామి పోలీసు విభాగంలో పనిచేసేవారు ) దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు …
కూర్మాపు నరసింహం మంచి చిత్రకారుడు . కుంచెతో కోటి భావాలు పలికించగల మహా వ్యక్తి . వర్ణ చిత్రాలతో శ్రీకాకుళం జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన విశిష్ట ప్రతిభా వంతుడు . శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామంలో కూర్మాపు నరసింహం 1902 నవంబర్ 2న జన్మించారు. చిట్టిమాచార్య వద్ద రంగుల ఓనమాలు దిద్ది సహజత్వానికి చేరువలో ప్రకృతి అందాలు రవివర్మకు ధీటుగా చిత్రాలు గీసి తన ఖ్యాతిని, శ్రీకాకుళం ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పారు. రూపచిత్రణలో నరసింహంది …
భాస్కరభట్ల రవి కుమార్ శ్రీకాకుళం జిల్లా గార మండలం బూరవెల్లి గ్రామములో (తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యులు నివాసంలో జన్మించాడు.తన తాత వద్ద సాహిత్య ప్రక్రియలతో అభ్యసన మొదలై మెలుకవులు ఆసక్తితో నేర్చుకోని గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది. చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లు ఈనాడు ,సితార సినీ పాత్రికేయులుగా పనిచేశారు.నేటికీ సుమారు 300 పైగా పాటలు రచన చేశారు , ఎన్నో మంచి తెలుగు చిత్రాల్లో మంచి పాటలు భాస్కరభట్ల కాలంనుంచి జాలువారాయి . ఉత్తమ గేయ …
నందికేశ్వరరావు మిమిక్రీ కళాకారుడు 64 కళలులో ఏదో ఒక కళ..ప్రతి మనిషిలో ఎదోఒక కళ దాగి ఉంటుంది , ఆ కళను గుర్తించి , సాధన చేసి ,మంచి గురువుల శిక్షణలో నైపుణ్యాలను పెంచుకొని , నిరంతర కృషితో ప్రయత్నం చేస్తుంటే కళారంగంలో రాణిస్తారు . నందికేశ్వరరావు శ్రీకాకుళం పట్నానికి చెందిన మిమిక్రీ కళాకారుడు . మిమిక్రీతో ప్రకృతిలో ఉన్న విభిన్న ధ్యనులను అనుకరించి , పలికించి సమ్మోహన పరిచే మాంత్రికుడుగా , అహూతులను అలరించే వినోధ …




