నందికేశ్వరరావు మిమిక్రీ కళాకారుడు
64 కళలులో ఏదో ఒక కళ..ప్రతి మనిషిలో ఎదోఒక కళ దాగి ఉంటుంది , ఆ కళను గుర్తించి , సాధన చేసి ,మంచి గురువుల శిక్షణలో నైపుణ్యాలను పెంచుకొని , నిరంతర కృషితో ప్రయత్నం చేస్తుంటే కళారంగంలో రాణిస్తారు .
నందికేశ్వరరావు శ్రీకాకుళం పట్నానికి చెందిన మిమిక్రీ కళాకారుడు . మిమిక్రీతో ప్రకృతిలో ఉన్న విభిన్న ధ్యనులను అనుకరించి , పలికించి సమ్మోహన పరిచే మాంత్రికుడుగా , అహూతులను అలరించే వినోధ సృస్టికర్తగా పేరుగాంచారు . శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన మిత్రులు , గురువులు సాయంతో సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో వేలాది ప్రదర్శనలిచ్చి ఎన్నో గౌరవ సత్కారాలు పొందారు .
ఒకవైపు ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ ..మిమిక్రీ కళాకారునిగా రానిస్తూ…రచయితగా.. , నటుడిగా… , చిత్రకళోపాధ్యాయునిగా.. , పసిద్ధ ధ్యనులను అనుకరించి కళాకారునిగా పేరుపొందిన నందికేశ్వరరావు డా.నేరెళ్ళ స్పూర్తితో స్వరమాంత్రికుడి ఏకలవ్య శిష్యునిగా పదిహేనేళ్ళ ప్రాయంలోనే ధ్వనులను అనుకరించడం ప్రారంభించారు . పాతశ్రీకాకుళం లోని తన ఇంటిదరిలోచెట్లపై పొద్దున్నే కిలకిల రావాలు చేసే పక్షుల ధ్వనులను, జంతువుల ద్వనులను నిశితంగా పరిశీలించేవారు . ఆ ద్వనులను అనుకరించేవారు ,ప్రకృతిలో పొందిన అనుభూతలను నిరంతర సాధన కృషితో మిమిక్రీ కళాకారునిగా ఎన్నో ద్వని ప్రయోగాలు చేసి ,ప్రముఖుల గొంతును అనుకరించి , ప్రదర్శించి గొప్ప మిమిక్రీ కళాకారునిగా పేరు సంపాదించారు , మరెందరినో శిష్యులను తయారుచేశారు . మిమిక్రీ శ్రీనివాస్ , సూర్యారావు తో పాటు విశాఖపట్నం లోను , ఇతర జిల్లాలలోను ఆయన శిష్యులున్నారు .
అవార్డులు :
- ఉత్తమ మిమిక్రీ కళాకారునిగా ఎనిమిది సార్లు పురస్కారాలు ,
- రాష్ట్ర స్థాయిలో మూడు బంగారు పతకాలు వరించాయి ,
- జిల్లా సాక్షరత సమితి శిబిరం లో సత్కారాలు ,
- గుజరాత్ లొ జరిగిన నెహ్రూ యువకేంద్రం శిక్షణ శిబిరం లో పురస్కారాలు పొందినారు ,
- ఎన్‌టిఆర్ , అక్కినేని , చిరంజీవి , అల్లు రామలింగయ్య , సుత్తివేలు , కోటా శ్రీనివాసరావు , బ్రహ్మానందం , వంటి స్నినీ ప్రముఖుల చేతులమీదుగా సత్కారాలు అందుకున్నారు .
- మర్రి చెన్నారెడ్డి , పి.వి.నరసింహారావు , జె.వెంగళరావు , చంద్రబాబునాయుడు వంటి రాజకీయ ప్రముఖులు సత్కరించారు .
- ఉత్తమ ఉపాధ్యాయుని గా ప్రభుత్వము సత్కరించినది .