(1975 – ) మహిళా విభాగంలో ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించిన ఏకైక మహిళ
కరణం మల్లీశ్వరి.
ఈమె ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీపంలో వూసవానిపేట గ్రామంలో శ్యామల, కరణం మనోహర్లకు 1975లో జన్మించింది. వీరి తల్లిదండ్రులు చిత్తూర్ జిల్లాకు చెందినవారు ,ఈమె తండ్రి రైల్వే రక్షణ దళంలో ఉద్యోగి, కళాశాల స్థాయి ఫుట్బాల్ ఆటగాడు. ఈమె తన 12ఏట చదువు మానివేసింది. 15 సంవత్సరాల వయస్సులో తన అక్క నరసమ్మను చూడడానికి బెంగుళూరు స్పోర్ట్స్ అధారిటీ కి వెళ్ళి ఆమెకు క్రీడలో అభిరుచి ఏర్పడి అక్కడే శిక్షణ ప్రారంభించింది. ఈమె శక్తి సామర్థ్యాలను గుర్తించి రష్యన్ కోచ్ రీయబోకన్ ఈమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈమె మొదటి ముఖ్యపతకం 1991లో అట్లాంటాలో జరిగిన జాతీయ క్రీడలో సాధించింది. అదికూడా రజితం.
2008 ఆ తర్వాత హిందూజా స్పోర్ట్స్ ఫౌండేషన్లో 1000/- ఉపకారవేతనంతో చేరి అక్కడే 5000/- ఉపకారవేతనం పొంది తన దృష్టినంతా వెయిట్ లిఫ్టింగ్ పై సారించి 1994 హీరోషిమా ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని సాధించి అంతర్జాతీయ కీర్తి సంపాదించింది. ఆ తర్వాత ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఒక రజితం, ఒక కాంస్యం సాధించింది. భారత ప్రభుత్వం ఆమెకు 1994లో అర్జున అవార్డు , 1996లో రాజీవ్ ఖేల్త్న అవార్డు బహూకరించింది.